సత్యనారాయణ వ్రతం
సత్యనారాయణ వ్రతం

ఏ ఇంట పెళ్లిపేరంటం జరిగినా మొదటిగా సత్యనారాయణ వ్రతం చేస్తారు. పెళ్లితంతు పూర్తికాగానే నూతన దంపతులు గృహస్థధర్మంలో ప్రవేశించేముందుగా ఈ వ్రతాన్ని చేయడం ఆచారం. గృహప్రవేశం సమయంలోనూ భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ వ్రతాన్ని చేస్తారు. శ్రీ సత్యనారాయణ వ్రతము పూర్ణిమ నాడు కానీ, ఏకాదశి నాడు కానీ చేయుట శ్రేష్ఠము. కార్తీక పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, మాస సంక్రాంతి రోజులలో చేస్తే విశేష ఫలితం.

సత్యనారాయణ వ్రతం
శంఖుస్థాపన

శుభ తిధులు తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, పూర్ణిమ; · శుభ దినాలు: సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం;· శుభ నక్షత్రాలు: రోహిణి, మృగశిర, పుష్యమి, హస్త, చిత్తా, స్వాతి, అనురాధ, ఉత్తరాషాడ, రేవతి; · శుభ లగ్నం: వృషభ, సింహ, వృశ్చిక, కుంభ.

సత్యనారాయణ వ్రతం
గృహప్రవేశము

శ్రేయస్సు మరియు శాంతిని తీసుకురావడానికి, ఇంటిని శుభ్రపరచడానికి మరియు శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. శుభ ముహూర్తాన్ని కీలకమైన జ్యోతిషశాస్త్ర అంశాల కలయిక ద్వారా లెక్కించబడుతుంది: తిథి: శుభప్రదంగా భావించే నిర్దిష్ట చంద్ర రోజులు. నక్షత్రం: రోహిణి, మృగశిర, రేవతి మరియు అనురాధ వంటి అనుకూలమైన నక్షత్రరాశులు. రోజు: సోమవారం లేదా గురువారం వంటి కొన్ని వారపు రోజులు సహజంగానే గృహ ప్రవేశానికి మరింత పవిత్రమైనవి.

సత్యనారాయణ వ్రతం
ముహూర్తపురాట

మంచి ముహూర్తం చూసి పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడానికి పందిరిరాట వేస్తారు. ఈ సందర్భంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరిపించమని విఘ్నేశ్వరుని పూజించి మండపంలో పెట్టిన బియ్యం మూట కట్టి పూజ మందిరంలో పెడతారు.

సత్యనారాయణ వ్రతం
వివాహం

వివాహం అనేది జీవిత ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా ఉంటామని వాగ్దానం చేసే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ మరియు హృదయపూర్వక నిబద్ధత యొక్క మిశ్రమం. ఇది హృదయాల కలయిక, స్నేహానికి మించిన బంధం, జీవితాంతం ఇద్దరు ఆత్మలను భాగస్వాములుగా చేస్తుంది. వధూవరుల గృహస్థాశ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ.

సత్యనారాయణ వ్రతం
విఘ్నేశ్వర పూజ

ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

సత్యనారాయణ వ్రతం
దేవతా ప్రతిష్టలు

మూర్తి ప్రతిష్ఠ అనేది పంచరాత్ర ఆగమ శాస్త్రాలు సూచించిన విధంగా వేద కర్మలు చేయడం మరియు మంత్రాలను జపించడం ద్వారా మూర్తిలో దేవుడిని ప్రార్థించే ఆచారం. కొత్త మందిరం ప్రారంభోత్సవ రోజున మూర్తి ప్రతిష్ఠ నిర్వహిస్తారు.

సత్యనారాయణ వ్రతం
శాంతి కార్యక్రమములు

జీవితంలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి హోమం ప్రత్యేకంగా సూచించబడుతుంది. గ్రహాల ప్రతికూల ప్రభావాల నుండి భద్రతను నిర్ధారించడానికి శాంతి హోమం చేయవచ్చు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం ద్వారా శ్రేయస్సు, సంపద మరియు విజయాన్ని సాధించడానికి దేవుని నుండి వరాలను పొందడానికి శాంతి హోమం సరైనది.

సత్యనారాయణ వ్రతం
జ్యోతిష్చక్రములు

100 సంవత్సరాల దశాంతర్దశా ఫలితాలు, జాతక ఫలితాలు, గజకేసరి మొదలైన యోగాలు, వాటి ఫలితాలు, కుజ దోష, కాల సర్పదోష మొదలైన దోషాల వివరాలు, వాటి ఫలితాలు, పరిహారాలు, ఏల్నాటి శని వివరాలు, 16 కుండలిలు, గ్రహస్థితులు - అష్టక వర్గ జాతక చక్రం.

సత్యనారాయణ వ్రతం
గ్రహదోషముల నివృత్తి

పూర్వీకులు చేసిన పాపముల వల్ల పితృ దోషం ఏర్పడుతుంది. జాతకుని జన్మకుండలిలో ఏ గ్రహం వల్ల అయితే పితృ దోషం ఏర్పడిందో, ఆ గ్రహానికి సంబంధించిన అధి దేవతను ప్రార్థించి వేడుకోవాలి. పూజాది హోమ కార్యక్రమములు జరిపించాలి.

సత్యనారాయణ వ్రతం
రుద్రాభిషేకములు

పండితుడు నుంచి పామరుడు వరకు, మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు ఎవరైనా సరే ఆ పరమేశ్వరుడిని శివ అని స్మరిస్తే చాలు కరుణ కురిపించే విశాల హృదయం ఆ శివుడిది. అభిషేకాలు అంటే ఎంతో ఇష్టమైన పరమేశ్వరుడు తనకు అభిషేకాలు చేయించే భక్తులను నీడలా కాపాడతాడు.

సత్యనారాయణ వ్రతం
సూర్య నమస్కారాలు

రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తారు. సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

మరియు అన్ని శుభకార్యక్రమములకు